కడప నగరంలో ఈ దర్శన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు కొన్నేళ్ల నుంచి ఈ దర్శన్ కేంద్రాల్లో పనిచేస్తున్నామని... కేవలం 7వేల రూపాయలతో విధులు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ దర్శన్ కేంద్రాలు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉపయోగపడుతాయని వారు తెలిపారు. వాటిని రద్దు చేయడం వల్ల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు స్వామివారి భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి. ఏడాదిన్నరలో నాడు-నేడు పనులు పూర్తి కావాలి: సీఎం