కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఈ-ఆటోలను మంజూరు చేసింది. ఎమ్మెల్సీ జకియా ఖానం ఈ-ఆటోలను ప్రారంభించారు. 9 ఆటోలను రాయచోటికి మంజూరు చేశారని ఆమె పేర్కొన్నారు. పురపాలికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. మినీ జేసీబీ కూడా వారంలోగా రానుందన్నారు. డంపింగ్ యార్డ్ లో రూ.15 లక్షలతో... రోడ్లు, క్లీనింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు.
రాయచోటి గ్రేడ్-1 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయినప్పటి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. అదనంగా 50 మంది పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో ఫాగింగ్ మెషిన్ కూడా అందుబాటులోకి రానుందన్నారు. రూ.350 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.
ఇదీ చదవండి: