కడపజిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. డిసెంబరు 26న జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడమే కాకుండా... రాజోలి ఆనకట్ట, బ్రహ్మంసాగర్ లిప్ట్ ఇరిగేషన్ తోపాటు వాటర్ గ్రిడ్ పథకానికి అదే రోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు. కడప నగరంలోని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో అంజద్ బాషా తన నూతన కార్యాలయంలోకి అడుగు పెట్టారు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే తన నూతన క్యాంపు కార్యాలయాన్ని కడప నగర నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నట్లు అంజద్ బాషా తెలిపారు.
ఇవీ చదవండి