ETV Bharat / state

కడపలో జోరుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు..

కడప జిల్లాలో ఆధునిక పంట డ్రాగన్ ఫ్రూట్ సాగు రోజు రోజుకు పెరుగుతోంది. మార్కెట్​లో అధిక డిమాండ్ ఉండటంతో రైతులంతా ఈ పంటను వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండకపోవడం.. వ్యాపారులే తోటల వద్దకు వచ్చి డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేస్తుండటంతో కొత్త సాగువైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు.

dragon fruit cultivation  in kadapa
కడపలో డ్రాగన్ ఫ్రూట్ సాగు
author img

By

Published : Jul 1, 2021, 3:59 PM IST

కడపలో డ్రాగన్ ఫ్రూట్ సాగు..

ఆధునిక పంట డ్రాగన్ ఫ్రూట్ కడప జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. తైవాన్, వియత్నం దేశాల్లో పండే ఈ పంటను ఇటీవల కాలంలో మన రైతులు సాగు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో 52.5 ఎకరాల్లో ఈ తోటలు విస్తరించాయి. నాటిన 9 నుంచి 12 నెలల లోపు కాపు రావడం, తక్కువ చీడపీడలు తెగుళ్లు, అధిక మార్కెట్ ధర, ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడం వల్ల పంటకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా వ్యాపారులే తోటల వద్దకు వచ్చి డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేస్తుండటంతో ఈ ఆధునిక పంట సాగువైపే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రైతు ప్రసాద్ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అతనికి అంతకుముందు నిమ్మ తోటలు ఉండేవి. వర్షాభావం, సరైన మార్కెట్ లేకపోవడంతో తరచూ నష్టాలను చవి చూసే వాడు. దీంతో ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు గత ఏడాది జూలైలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి సుమారు 4వేల మొక్కలను తెప్పించి నాటాడు. ప్రస్తుతం కాపు రావడంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు..

డ్రాగన్ ఫ్రూట్ తోట వేయాలంటే కచ్చితంగా రాతి దిమ్మెలు అవసరం. ఒక రాతి దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలు నాటుతారు. ఒక ఎకరాకు 450 నుంచి 500 వరకు ఈ స్తంభాలు కావాల్సి ఉంటుంది. ఇందులో దాదాపు 1800 నుంచి 2000 మొక్కలు నాటుతారు. ఒక ఎకరాకు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే మొదటి సంవత్సరంలో ఐదు వందల కిలోల నుంచి ఒక టన్ను, రెండవ సంవత్సరం ఒకటి నుంచి రెండు, మూడో ఏడాది రెండు నుంచి నాలుగు, నాలుగో ఏడాది 4 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ ధర ఒక కిలోకు 150 రూపాయలు పలుకుతోంది. పింకు రకం ఫ్రూట్ 200 నుంచి 250 రూపాయల వరకు ధర పలుకుతోంది. నీటి అవసరం కూడా ఎక్కువగా ఉండదని, తెగుళ్ళు తక్కువేనని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.

కడప జిల్లాలో జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట, వీరపునాయునిపల్లె, సుండుపల్లె, లక్కిరెడ్డిపల్లె, చిట్వేలి తదితర మండలాల్లో ఈ నూతన వేగంగా విస్తరిస్తోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ పంటకు మంచి గిరాకీ ఉంటుందని.. రైతులందరూ ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

Sachivalayam: 13 నెలలుగా అద్దె చెల్లించడంలేదంటూ.. గ్రామ సచివాలయానికి తాళం!

కుక్కపై కర్కశత్వం- వేలాడదీసి, చితకబాది...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.