కడప జిల్లా వేంపల్లిలో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులసు గురవుతున్నారు. తమకు రేషన్ కార్డులు లేవని, ఆధార్ కార్డు ద్వారా బియ్యం ఉచితంగా ఇవ్వాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. ఆయన వేంపల్లిలోని రైస్ మిల్లర్ల యాజమాన్యాలతో మాట్లాడి ఉచితంగా 65 బస్తాల బియ్యాన్ని రైస్ మిల్లర్ల సమక్షంలో పంపిణీ చేశారు. అలాగే నందిపల్లిలో బయపురెడ్డి అనే వ్యక్తి ఇంటింటికి 10 రోజులకు సరిపడా కూరగాయలను పంపిణీ చేశారు.
వేంపల్లిలో బియ్యం, కూరగాయలు పంపిణీ - కడప జిల్లాలోని వేంపల్లి లో బియ్యం ,కూరగాయల పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి పలువురు తమ వంతు సాయంగా తోచిన విధంగా సాయం వారు చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు వారానికి సరిపడా కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే బతుకుదెరువు కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల వారికి రైస్ మిల్ నిర్వాహకులు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.
వేంపల్లిలో బియ్యం, కూరగాయల పంపిణీ
కడప జిల్లా వేంపల్లిలో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులసు గురవుతున్నారు. తమకు రేషన్ కార్డులు లేవని, ఆధార్ కార్డు ద్వారా బియ్యం ఉచితంగా ఇవ్వాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. ఆయన వేంపల్లిలోని రైస్ మిల్లర్ల యాజమాన్యాలతో మాట్లాడి ఉచితంగా 65 బస్తాల బియ్యాన్ని రైస్ మిల్లర్ల సమక్షంలో పంపిణీ చేశారు. అలాగే నందిపల్లిలో బయపురెడ్డి అనే వ్యక్తి ఇంటింటికి 10 రోజులకు సరిపడా కూరగాయలను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:నిరాడంబరంగా ఒంటిమిట్టలో సీతారామకల్యాణం