కడప జిల్లా గండికోట జలాశయం నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం కొండాపురంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పరిహారం 3లక్షల 25వేల రూపాయలు భూములు కోల్పోయిన వారికి అందజేయనున్నట్లు వారు తెలిపారు. గండికోట జలాశయం పరిధిలో మొత్తం ఇరవై రెండు గ్రామాలు ఉండగా గతంలో 6,75,000 రూపాయలు గత ప్రభుత్వం అందజేసిందన్నారు. జగన్ అధికారం చేపట్టాక మూడు లక్షల 25 వేల చొప్పున నిర్వాసితులకు అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.
ఈ సంవత్సరం గండికోట ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపాలని సీఎం సూచించినట్లు వివరించారు. ముంపునకు గురైన ఇళ్లను ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మించి, రోడ్లు, కాలువలు, ప్రభుత్వ పాఠశాలు వంటి మౌలిక వసతులను కూడా అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: కడప జిల్లాలో తెలంగాణ మద్యం... ముగ్గురి అరెస్టు