ETV Bharat / state

క్రమశిక్షణతోనే విజయం..రాజావారు రాణిగారు చిత్రం ఫేం హీరో అబ్బవరం

లక్ష్య సాధన లో కష్టంతో పాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం వస్తుందని రాజావారు రాణిగారు చిత్ర కథానాయకుడు అబ్బవరం కిరణ్ అన్నారు. కడప జిల్లాలో తను చదువుకున్న కాలేజిలో చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు ఆయన.

author img

By

Published : Aug 6, 2019, 12:19 PM IST

అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రాజావారు రాణిగారు చిత్ర బృందం సందడి
అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రాజావారు రాణిగారు చిత్ర బృందం సందడి


కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రాజావారు రాణిగారు చిత్ర బృందం సందడి చేసింది. చిత్రంలోని మొదటి పాటను విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య విడుదల చేశారు. ఈ పాటకు యువత చిందులేసి, కేరింతలు కొడుతూ సందడి చేశారు. జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు, అయితే దానికి కష్టంతో పాటు క్రమశిక్షణ ఉండాలని సినిమా చిత్ర కథానాయకుడు అబ్బవరం కిరణ్ అన్నారు. తాను ఇదే కళాశాలలో చదివానని, క్రమశిక్షణ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని ఆయన తెలిపారు.

ఇది చూడండి: 'భానుడి ప్రతాపం': జులైలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత

అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రాజావారు రాణిగారు చిత్ర బృందం సందడి


కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రాజావారు రాణిగారు చిత్ర బృందం సందడి చేసింది. చిత్రంలోని మొదటి పాటను విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య విడుదల చేశారు. ఈ పాటకు యువత చిందులేసి, కేరింతలు కొడుతూ సందడి చేశారు. జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు, అయితే దానికి కష్టంతో పాటు క్రమశిక్షణ ఉండాలని సినిమా చిత్ర కథానాయకుడు అబ్బవరం కిరణ్ అన్నారు. తాను ఇదే కళాశాలలో చదివానని, క్రమశిక్షణ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని ఆయన తెలిపారు.

ఇది చూడండి: 'భానుడి ప్రతాపం': జులైలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత

Intro:FILE NAME : AP_ONG_41_06_CHANATA_PARISRAMA_IBBANDULU_PKG_VISU_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM) ఎంప్లాయ్ ఐడి : 748, ఫోన్ : 9866931898

నోట్ : రేపు (07-08-2019) అంతర్జాతీయ చేనేత దినోత్సవం.. దీనికి సంబంధించిన కధనం.. పరిశీలించగలరు.

యంకర్ వాయిస్ : ఒకప్పుడు వేలాది మగ్గాల చప్పుళ్లతో స్వాగతం పలికే చేనేత లోగిళ్లు.... నేడు నిశ్శబ్ద రాజ్యమేలుతుంది. పాడుపడి మట్టిగొట్టుకుపోయిన చేనేత మగ్గాలు దర్శనమిస్తున్నాయి... ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చేనేత పరిశ్రమ కనుమరుగయ్యే పరిస్దితిదాపురించింది.. చేనేతపరిశ్రమ చిక్కిపోవటంతో కుటుంబాలను పోషించుకునేందుకు కార్మికులు కూలిపనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని లేకపోతే చేనేత దుస్తులు చరిత్రపుటల్లో నిలిచిపోతాయని చేనేత విశ్లేషకులు చెపుతున్నారు..అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భముగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం....

వాయిస్ ఓవర్ : భారతదేశం లో వ్యవసాయం తరువాత అతిముఖ్యమైనది చేనేతపరిశ్రమ... మగువల మనసులను దోచే... అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను నేసిన నేతన్నల పరిస్దితి దుర్భరంగా మారింది... నేతనేసే నులుపోగులు ఉరితాళ్లయి వెక్కిరిస్తోంటే... కుటుంబాలను పస్తుపెట్టలేక కూలిపనులకు వెళుతున్నారు... మనసుకు పదునుపెట్టి పొగుపొగును దగ్గరచేర్చి మంచి డిజైన్లను నేతనేసి అతివల మనసుదోచిన నేతకార్మికుల పేగులు ఆకలితో అల్లాడుతున్నాయి.. మరేరంగంలో లేనంత కార్మికుల శ్రమ ఒక్క చేనేతరంగంలోనే దోపిడీకి గురవుతుంది... అనారోగ్యం,ఆకలి, అప్పులు వారు గడించిన ఆస్తులు... ప్రస్తుతం చేనేత పరిశ్రమ అంపశయ్య మీద కొట్టుమిట్టాడుతుంది... ఒకప్పుడు ప్రకాశం జిల్లా 45వేలు మగ్గాలుండగా ఒక్క చీరాల ప్రాంతంలోనే 30 వేల మగ్గాలుండగా వాటిపై 80 వేలమంది ఆధారపడి జీవించే వారు.... ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో 19 వేల మగ్గాలున్నాయి. చీరాల,వేటపాలెం, ఈపురూపాలెం,పందిళ్లపల్లి,దేవంగపురి ప్రాంతాల్లో మగ్గాలు మూతపడ్డాయి... పెరిగిన నూలు ధరలు, రంగురసాయనాల ధరలు, పవర్ లుమ్ మగ్గాలు తో చేనేతకార్మికులకు పనిలేకుండా చేసాయి... దీంతో సంక్షోభంలో ఉన్న చేనేత పనిని వీడి కూలిపనులకు వెళుతున్నామని కార్మికులు చెపుతున్నారు... మహిళలు కూలికి పూలుకదుతున్నారు... మరికొందరు చేనేతపై మమకారం చావక మగ్గాలనే నేస్తూ కాలం వెల్లదీస్తున్నారు... 2005 వ సంవత్సరం జనవరిలో జరిగిన ప్రపంచీకరణ ఒప్పందం చేనేతకార్మికులకు మరణశాశనమే అయింది... ఈ ఒప్పందం ప్రకారం అప్పటి కేంద్రప్రభుత్వం 7.400 కోట్లతో ఆధునికయంత్రాలతో దుస్తులు తయారుచేసుకునే వీలుకలిపించింది.. యంత్రాలు రావటంతో చేనేత పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేయబడింది.. చేనేత పరిరక్షణకోసం ఎన్ని పధకాలు, చట్టాలు చేసినా వాటి అమలు నోచుకోవటంలేదు... చేనేత చట్టం ప్రకారం 11 రకాలు చేనేత పైనే నేయాలి.. అయితే మరమగ్గాల యజమానులు వాటికి తూట్లుపొడిచి అవికూడా మరమగ్గాలపైనే నేస్తున్నారు... అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వరంగ సంస్దల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వారంలో ఒక్కరోజు చేనేత వస్త్రాలను ధరించాలని జిఓ జారీచేశారు.. అది కాగితాలకే పరిమితమయింది...ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చేనేతకు ప్రత్యేక కార్పోరేషన్ కేటాయించి తమిళనాడు తరహాలోనే చేనేత కార్మికులకు పధకాలు అమలుచేయాలని కార్మికులు కోరుతున్నారు.... లేకపోతే చేనేత పరిశ్రమ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని చేనేత విశ్లేషకులు అభిప్రాయపడున్నారు...


Body:బైట్ : 1 : ఆకురాతి వెంకట నారాయణ, చేనేత కార్మికుడు.
బైట్ : 2 : శివకుమారి, నేత కార్మికురాలు.
బైట్ : 3 : లీలాకుమారి, నేత కార్మికురాలు.
బైట్ : 4 : నారాయణ స్వామిబ్, నేత కార్మికుడు.
బైట్ : 5 : పడవల లక్ష్మణ స్వామి, ఆంధ్ర ప్రదేశ్ వీవర్స్ వెల్పేర్ అసోషియేషన్ ప్రధానకార్యదర్శి.


Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.