ETV Bharat / spiritual

ఇంట్లో గుర్రాల పెయింటింగ్ వల్ల ప్రయోజనాలు - లక్ష్మీదేవి ఫొటో ఏమూలకు పెడితే ఎలాంటి లాభమో తెలుసా? - BENEFITS OF PAINTING HORSES AT HOME

ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు పరిహారాలు

benefits_of_painting_horses_at_home
benefits_of_painting_horses_at_home (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 9:27 AM IST

Benefits of painting horses at home : ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు ఇలా ఎక్కడైనా సరే దేవతా విగ్రహాలు ఎక్కడ పెట్టాలి? ఎలాంటి విగ్రహాలు, ఫొటోలు ఎంచుకోవాలి? అని అనేక సందేహాలు ఉంటాయి. వారి కోసం ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ కొన్ని విషయాలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా గుర్రం బొమ్మ, విగ్రహం, పోస్టర్, పెయింటింగ్ ఇంట్లో ఏ దిక్కున ఏర్పాటు చేసుకోవాలో వివరించారు. అదే విధంగా లక్ష్మీదేవి విగ్రహం, ఫొటో, పోస్టర్లు ఎలాంటివి ఎంచుకోవాలో, ఏ దిక్కున పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఇస్తుందో వెల్లడించారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

'చింతలు తీర్చే 'చింత కొమ్మ తాంత్రిక పరిహారం' - ఇంటి వాస్తు దోషాలకు చెక్'

చాలా మంది తమకు కలిసొస్తుందన్న ఆలోచన, ఇంటికి అందాన్నిస్తుందన్న ఉద్దేశంతో ఇళ్లలో గుర్రాల పెయింటింగ్, పోస్టర్లు వేయిస్తుంటారు. అయితే, ఏ ఇంట్లో అయితే గుర్రం బొమ్మ, ఫొటో ఉంటుందో వారిపై హయగ్రీవుడి అనుగ్రహం ఉంటుందని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. గుర్రం బొమ్మకు పరిహార శాస్త్రంలో విశేష ప్రాధాన్యం ఉందని, సాక్షాత్తూ హయగ్రీవ రూపంలో ఉన్న శ్రీమహా విష్ణువు అని తెలిపారు. ఏ ఇంట్లో అయితే గుర్రం బొమ్మ, లేదా ఫొటో ఉంటుందో వారికి హయగ్రీవుడి అనుగ్రహం ఉంటుందని, గుర్రాల పెయింటింగ్ ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఐశ్వర్య ప్రయోజనం, ధనలాభం చేకూరుతుందన్నారు.

గుర్రం సమస్త సంపదలకు సంకేతమని, సర్వ సంపదలు, అఖండ ధనలాభం, విద్యార్థులు తిరుగులేని విజయాలు సాధిస్తారని చెప్పారు. గుర్రాల పెయింటింగ్ హాల్ లో ఉంటే అఖండ ధనలాభం చేకూరుతుందని వెల్లడించారు. అయితే, ఆ గుర్రాలు ఇంటి బయటికి వెళ్తున్నట్లుగా కాకుండా లోపలికి వస్తున్నట్లుగా ఉండాలని వివరించారు. గుర్రం ముఖం ప్రధాన ద్వారం వైపు కాకుండా ఇంటి లోపలికి వేరే దిక్కు వైపు చూస్తున్నట్లుగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంటిలోపలికి వస్తున్నట్లుగా హాల్ లో ఏర్పాటు చేసుకుంటే హయగ్రీవుడి అనుగ్రహం, అఖండ ధనలాభం కలుగుతుందన్నారు.

గుర్రం పోస్టర్, బొమ్మ, లేదా విగ్రహం ఇంట్లో ఏ దిక్కున ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించారు. ఎక్కడైనా, ఏ గదిలో అయినా దక్షిణ దిక్కులో ఉంటే ఆడవాళ్లకు అదృష్టం కలిసొస్తుందని, వారి పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయని వెల్లడించారు. ఆర్థికంగా కలిసొస్తుందని, గౌరవ, మర్యాదలు పెంపొందుతాయని, అఖండ ధనలాభం చేకూరుతుందని చెప్పారు.

నైరుతి దిశలో ఏర్పాటు చేసుకుంటే ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఉంటాయన్నారు. గుర్రం ఫొటో ఈశాన్య దిక్కులో ఫొటో ఉంటే పిల్లలకు స్కాలర్ షిప్ వస్తుందని, విద్యా లాభం జరుగుతుందని, వాయువ్యంలో పెట్టుకుంటే వ్యాపార వృద్ధి బాగా జరుగుతుందని, బిజినెస్ విజయానికి ఉపయోగపడుతుందని మాచిరాజు వివరించారు.

లక్ష్మీదేవత ఫొటో ఏ వైపు పెట్టుకోవాలంటే!

లక్ష్మీ దేవత ఫొటో విషయంలోనూ మాచిరాజు కిరణ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. లక్ష్మీదేవి ఫొటో కేవలం పూజామందిరంలోనే కాకుండా గోడలకు కూడా పెట్టుకోవచ్చని తెలిపారు.

అమ్మవారి ఫొటో తూర్పున ఉండి పడమర వైపు చూస్తుంటే పిల్లలు బాగా చదువుతారని, పోటీ పరీక్షల్లో నెగ్గుతారని, జీవితంలో తొందరగా సెటిల్ అవుతారని చెప్పారు. ఫొటో పడమర దిక్కులో ఉంచి అమ్మవారు తూర్పునకు చూస్తున్నట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయని, నెగెటివ్ ఎనర్జీ, దిష్టి దోషం పోతుందని అన్నారు.

దక్షిణ దిక్కులో ఉండి ఉత్తరం వైపు చూస్తుంటే సిరుల వర్షం కురుస్తుందని, డబ్బు పరంగా లోటు ఉండకూడదనుకుంటే ఆమె చూపు ఉత్తర దిశ వైపు ఉండాలని పేర్కొన్నారు. ఉత్తరం వైపు ఉండి దక్షిణం వైపు చూస్తున్నట్లయితే మోక్షం సిద్ధిస్తుందట.

ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ దేవి చూపు నైరుతి దిక్కు వైపు పడుతుంది. అపుడు యజమాని మాటకు గౌరవం ఉంటుందని, కుటుంబ కలహాలు తొలగిపోతాయని తెలిపారు. ఆగ్నేయంలో ఉంటే అమ్మ వారి చూపు వాయువ్యంపైపు పడుతుందని ఫలితంగా పిల్లల మొండితనం, అల్లరి తగ్గుతుందని, చెప్పినట్లుగా వింటారని వివరించారు.

అలాంటి ఫొటోలు బెటర్

కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫొటో ఇంట్లో, నిలబడి ఉన్న అమ్మవారి ఫొటో వ్యాపార స్థలం, సంబంధ విషయాల్లో పెట్టుకోవాలని మాచిరాజు తెలిపారు. అమ్మవారు తామరపువ్వులో కూర్చుని ఒక చేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నట్లు, మరో చేతితో అభయ ముద్ర, ఏనుగులు నీటిని అభిషేకిస్తున్నట్లుగా ఉన్న ఫొటో పెట్టుకోవాలని తెలిపారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

'ఏం చేసినా మీ కష్టాలు పోవడం లేదా? - ఫైనల్​గా ఇంట్లో ఆ మూలన దీపం వెలిగించి చూడండి!'

'సంపాదించిన డబ్బు పైసా కూడా మిగలడం లేదా ? - ఈ పరిహారాలు చేస్తే చూడండి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.