ప్రధానమంత్రి జనవికాస్ ప్రోగ్రాం కింద కడప జిల్లాలో పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి 40 కోట్ల 68 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అంజాద్ బాషా వివరించారు. తన నివాసంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష జరిపిన అంజాద్ బాషా.. ప్రధానమంత్రి జనవికాస్ ప్రోగ్రాం కింద కడప జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్, అంగన్వాడీ సెంటర్లు, సద్భావన్ మండపాలకు ఈ నిధులు వెచ్చించనున్నట్టు చెప్పారు.
ప్రొద్దుటూరు సద్భావన్ మండపానికి 50 లక్షల రూపాయలు, ప్రొద్దుటూరు టౌన్లో రెసిడెన్షియల్ బాలికల స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 9 కోట్లు, ప్రొద్దుటూరు టౌన్లో మైనారిటీ జూనియర్ కళాశాల నిర్మాణానికి కోటి 90 లక్షలు, రాయచోటి టౌన్ సద్భావన్ మండపానికి 40 లక్షల 50 వేలు, రాయచోటిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 9 కోట్లు, రాయచోటిలో అంగన్వాడి సెంటర్ల నిర్మాణానికి కోటి 87 లక్షల 50 వేలు, రాయచోటిలో బాలికల రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 9 కోట్లు, ప్రొద్దుటూరులో బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 9 కోట్లు, మొత్తం 40 కోట్ల 68 లక్షల రూపాయలు మంజూరు చేశారని వివరించారు.
వీటి నిర్మాణాలు 2016-17,18 సంవత్సరాలలో ప్రారంభమై 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 117, 119, 121 ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించామని చెప్పారు.
ఇదీ చదవండి: