రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు గౌరవవేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయం అని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. దేవాలయాల్లో పనిచేసే మొదటి కేటగిరి అర్చకులకు గతంలో నెలకు రూ.10 వేలు ఇస్తుండగా... ప్రస్తుతం వారికి రూ.15 వేలకు పెంచారని ఉపముఖ్యమంత్రి తెలిపారు. మసీదుల్లో ఇమామ్లకు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు, పాస్టర్లకు రూ.5వేలు గౌరవ వేతనం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారని అంజాద్ బాషా వెల్లడించారు.
ఇదీచదవండి.