లాక్ డౌన్ సందర్భంగా పవిత్ర రంజాన్ పండగను ముస్లింలంతా ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగను... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ముస్లిం మత పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు అందరూ ఇళ్లలోనే ఉండి జరుపు కోవడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మసీదుల్లోకి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. శుక్రవారాల్లో ప్రార్థనలు చేసుకునే సమయంలో కూడా సామాజిక దూరం పాటించాలని అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :