ETV Bharat / state

కడప ఉక్కు కర్మాగారం పనుల్లో జాప్యం - కడప స్టీల్ ప్లాంట్ పనుల్లో జాప్యం

‘రాయలసీమ ఆర్థిక పరిస్థితులను మార్చేందుకు ఉక్కు సంకల్పంతో ఉక్కు కర్మాగార నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా. దీన్ని మూడేళ్లలో పూర్తిచేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పిస్తాం. కర్మాగారం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కొందరు పెద్దవాళ్లతో చర్చిస్తోంది. అవి ఫలిస్తే.. పనులు మొదలుపెట్టాక ఎవరో ఒకరు వచ్చి కలుస్తారు. ఎవరూ రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఏర్పాటు చేస్తుంది’ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది డిసెంబరు 23వ తేదీన జమ్మలమడుగులో సమీకృత ఉక్కు కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా అన్న మాటలివి. ముఖ్యమంత్రి చెప్పిన మూడేళ్ల వ్యవధిలో ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచినా పనుల్లో ప్రగతి నామమాత్రంగానే ఉంది. ‘

delay in setting up of kadapa steel plant
కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పనుల్లో జాప్యం
author img

By

Published : Oct 12, 2020, 12:24 PM IST

కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పనుల్లో జాప్యం జరుగుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపనలు నిర్వహించినా పనులు ముందుకు సాగలేదు. గతేడాది డిసెంబరు 23వ తేదీన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల మధ్యలో 3148.68 ఎకరాల విస్తీర్ణంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో సమీకృత ఉక్కు కర్మాగార నిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆనాడు నిర్వహించిన బహిరంగ సభలో మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పలు ప్రభుత్వ అనుమతులను కూడా మంజూరు చేశారు. పారిశ్రామిక అవసరాలకు గండికోట జలాశయం నుంచి ఉక్కు కర్మాగారానికి రెండు టీఎంసీల నీటి తరలింపునకు నిర్ణయించారు. ఉక్కు తయారీలో ముడి సరకైన ఇనుము (ఐరన్‌) సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కర్మాగార ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌(ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌) పేరిట ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్లలో ఉక్కు కర్మాగార ఏర్పాటు పనుల కోసం సుమారు రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. అయితే నిర్మాణ పనుల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని గమనిస్తే.. 2023 నాటికి కూడా ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించలేకపోవచ్చునని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

పెట్టుబడి విషయంలో సందిగ్ధం

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించలేకపోయింది. ప్రధానంగా పెట్టుబడి విషయంలో సందిగ్ధం నెలకొనడంతోనే పనుల్లో పురోగతి లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఎవరు ఆర్థికపరంగా బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉక్కు కర్మాగార ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. ఇటీవల దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ఒకవైపు కేంద్రాన్ని సాయం అర్థిస్తూనే, పెట్టుబడులకు ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ఏడు ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. అయితే వీటిలో ఒక సంస్థని భాగస్వామిగా ఎంపిక చేయాల్సి ఉంది.

కనీస వసతులేవీ?

ఉక్కు కర్మాగారానికి కేటాయించిన భూముల్లో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఆ భూముల చుట్టూ సరిహద్దు గోడ మాత్రమే నిర్మించారు. వాటిని పరిశ్రమ నిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేయలేదు. ఇందుకోసం రహదారులు, విద్యుత్తు, నీరు లాంటి మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. కర్మాగార ఏర్పాటులో భాగస్వామిని నిర్ణయించే నాటికి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ పరిశీలనలో టెండరు పత్రం

ఉక్కు కర్మాగారం ఏర్పాటులో భాగస్వామ్యం కావడానికి ఏడు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపాయి. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేయడానికి టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం సమగ్ర అంశాలతో కూడిన టెండరు పత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దానికి ఆమోదం లభించిన వెంటనే టెండరు నిర్వహించి భాగస్వామిని ఖరారు చేస్తాం. కర్మాగారం కోసం కేటాయించిన స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తున్నాం. విద్యుత్తు పనులకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గండికోట జలాశయం నుంచి నీటి తరలింపునకు డీపీఆర్‌ రూపొందించాల్సి ఉంది. - షన్మోహన్‌, ఎండీ, ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌

ఇదీ చదవండి: చింతకొమ్మదిన్నెలో కుంగుతున్న భూమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.