ETV Bharat / state

పల్లెల్లో ఎల్​ఈడీ దీపాలు... నిర్వహణలో లోపాలు! - LED lights latest news

గ్రామీణ ప్రాంతాల్లోనూ వీధుల్లో ఎల్‌ఈడీ దీపాలు అమర్చాలని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. కానీ వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. కొన్ని గ్రామాల్లో మూడో తీగ లేక నిరంతరం వెలుగుతుండగా... మరికొన్నింటిలో సాంకేతిక కారణాల వల్ల అంధకారం ఏర్పడుతుంది. పంచాయతీ, విద్యుత్తుశాఖల అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు చెబుతున్నారు.

maintenance of LED lights
ఎల్​ఈడీ దీపాల నిర్వహణ
author img

By

Published : Jun 20, 2021, 7:26 PM IST

రోజురోజుకీ విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. రానురాను నిర్వహణ మరింత భారమవుతోంది. సాంకేతిక లోపాలతో నిత్యం చీకట్లు కమ్మేస్తున్నాయి. మరమ్మతుల మాయతో నిధులు కరిగి పోతున్నాయి. వీధి దీపాల ఏర్పాటు, పర్యవేక్షణ, మరమ్మతులకు గురైతే బాగుచేయడం పంచాయతీలకు గుదిబండగా మారింది. ఫలితంగా ప్రజలకు అంధకారం తప్పడం లేదు. ఇలాంటి కష్టాల నుంచి ఉపశమనం కల్పించాలని మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె సిగలో ఎల్‌ఈడీ వెలుగులు ప్రకాశించే విధంగా పనులు చేపట్టాలని ముందుకొచ్చారు. ఇటీవల వీటి బాగోగులను ఎవరూ పట్టించుకోవడంలేదు. కొన్ని గ్రామాల్లో పగలే పండు వెన్నెలను తలపిస్తుండగా, మరికొన్ని పల్లెల్లో రాత్రి పూట వెలగక అంధకారం కమ్మేసినా అంతులేని అలసత్వం కనిపిస్తోంది.

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, కోనరాజుపల్లె ఎస్సీ కాలనీలో 30 ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. అందులో 22 పగలూ, రాత్రి వెలుగుతున్నాయి. స్విచ్‌లు ఏర్పాటు చేయలేదు. 24గంటల పాటు వెలగడం, సాంకేతిక లోపాలతో మరో ఎనిమిది వెలగడం లేదు. నిర్వహణపై పంచాయతీ, విద్యుత్తు అధికారులు గాలికొదిలేశారు.

జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 4,418 గ్రామాల్లో సుమారు 5.04 లక్షల కుటుంబాలుండగా 19.53 లక్షల మంది నివసిస్తున్నారు. గ్రామాల్లో రాత్రివేళ అంధకారంలో ఉంటున్న ప్రజలకు రక్షణ భరోసా ఇవ్వాలని ఆశయంతో అధునాతన ఎల్‌ఈడీ దీపాలను అమర్చాలని గత ప్రభుత్వ పాలకులు సంకల్పించారు. ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌), పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) ద్వారా పనులు చేయించారు. జిల్లా వ్యాప్తంగా 24 వాట్స్‌ సామర్థ్యం ఉన్నవి 1,69,928, 32 వాట్స్‌ విభాగంలో 3,122 అమర్చారు. మండల కేంద్రాలు, జన సమూహమున్న కూడళ్లలో అధిక కాంతినిచ్చే 75 వాట్స్‌ దీపాలు 1,025 బిగించారు. కడప డివిజన్‌లో 63,192, రాజంపేట 61,163, జమ్మలమడుగు డివిజన్‌లో 49,720 దీపాలున్నాయి.

details
ఎల్​ఈడీ దీపాల వివరాలు
  • విద్యుత్తు పొదుపు పట్టదా?

విద్యుత్తు ఉత్పత్తి, గిరాకీ, సరఫరా, వినియోగం మధ్య అంతరం ఉంది. సాధారణ దీపాలతో మీటరు గిర్రున తిరుగుతోంది. బిల్లు భయపెడుతోంది. ఈ తరుణంలో తక్కువగా విద్యుత్తు ఖర్చయ్యే ఎల్‌ఈడీ రకాలు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపణీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మూడో తీగ ఏర్పాటు చేసి అనుసంధానించాలని నిర్ణయించారు. ఎంసీబీ సీసీఎం జంక్షన్‌ పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి రిమోట్‌ వ్యవస్థతో దీపాలు పనిచేసేవిధంగా ఏర్పాటు చేశారు. సాయంత్రం చీకటి పడగానే వెలిగేలా, తెల్లారిన వెంటనే ఆగిపోయేలా సమయపాలన అమలయ్యేలా చేపట్టారు. కాకపోతే క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు. రాత్రి వేళలే కాకుండా పగటి పూట కూడా కాంతులు పంచుతూ పనిచేయడంతో కాలిపోతున్నాయి. 24 వాట్స్‌ సామర్థ్యం ఉన్న ఒక దీపం ధర రూ.1,650. ఒక్కొక్క పంచాయతీలో మూడు నెలలకొకసారి రూ.150 చెల్లించాలని అప్పట్లో నిర్ణయించారు. పగలూ, రాత్రి వెలగడంతో విద్యుత్తు ఆదా కావడం లేదు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు.

  • ఆ ఉత్తర్వులు అమలయ్యేనా?

గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాల నిర్వహణను ఇంధన సామర్థ్యం సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌), పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) పరిధిలో ఉన్న పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగిస్తూ గతేడాది డిసెంబరు 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం క్షేత్రస్థాయిలో అమలు విధి విధానాలను ఖరారు చేస్తూ ఈ ఏడాది మార్చి 3న పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు మరో ఉత్తర్వు-11 ఇచ్చారు. దీనికి ‘జగనన్న పల్లె వెలుగు’గా నామకరణం చేశారు. గ్రామ సచివాలయ కార్యదర్శులే పర్యవేక్షించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది పక్కాగా అమలు కావడం లేదు. మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల మధ్య సమన్వయం లోపం గ్రామీణులకు శాపంగా మారింది.

నిరంతరం వెలుగుతున్నాయి

మా గ్రామంలో 30 ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. ఆరు నెలలుగా చూస్తే 22 దీపాలు పగలు, రాత్రి నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. స్విచ్‌ వసతి ఏర్పాటు చేయలేదు. పంచాయతీ, విద్యుత్తు అధికారులు పట్టించుకోలేదు. ఇలాగైతే విద్యుత్తు ఎలా ఆదా ఎలా అవుతుందో అధికారులకే తెలియాలి. - ఎం.ఓబయ్య, కోనరాజుపల్లె ఎస్సీ కాలనీ, ఒంటిమిట్ట మండలం

రెండు నెలలుగా వెలగడంలేదు

మా కాలనీలో రెండు నెలలుగా ఎనిమిది దీపాలు వెలగడంలేదు. ఇంతవరకు మరమ్మతులు చేయించలేదు. రాత్రివేళల్లో అంధకారంతో ఇబ్బందులు పడుతున్నాం. స్విచ్‌ బోర్డులు ఏర్పాటు చేయలేదు. విద్యుత్తు పొదుపు చేయాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా ఉండటం సరైన విధానం కాదు. - సగినాల చిన్నా, కోనరాజుపల్లె ఎస్సీ కాలనీ, ఒంటిమిట్ట మండలం

ప్రత్యేక దృష్టి సారించాం

పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడైనా వెలగలేదని ప్రజల నుంచి ఫిర్యాదులందితే వెంటనే స్పందించి మరమ్మతులు చేయిస్తాం. కొన్ని గ్రామాల్లో రోజంతా వెలుగుతున్నట్లు సమాచారం అందింది. విద్యుత్తుశాఖ అధికారులతో మాట్లాడి మూడో తీగ ఏర్పాటు చేయిస్తాం. రాత్రి పూట మాత్రమే వెలుగులు పంచే విధంగా చర్యలు తీసుకుంటాం. విద్యుత్తు ఆదా చేయడం ద్వారా పంచాయతీలపై విద్యుత్తు బిల్లుల భారాన్ని తగ్గిస్తాం. - ధనిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా బాధ్య పంచాయతీ అధికారి, కడప

ఇదీ చదవండి: BJP Vishnu: 'రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే..తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా ?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.