కడప జిల్లా పెన్నా నదిలో వరద ప్రవాహం తగ్గింది అనుకుని ఊపిరి పీల్చుకున్న కాసేపటికే, మళ్లీ పెన్నా ఉరకలేస్తోంది. గత రెండు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. 1.21లక్షల క్యాసెక్కులుగా ఉన్న వరద ప్రవాహం నిన్నటికి 62 వేల క్యూసెక్కులకు చేరింది. హమ్మయ్య ! అనుకునేలోపే, ఇవాళ మళ్లీ పెన్నా నదిలో వరద ప్రవాహం 74 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో నీటిపారుదల అధికార్లు అప్రమత్తం అయ్యారు. ఈ వరద నీరంతా నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ట నీటిమట్టం 78 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 56 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది.
ఇదీ చదవండి:జోరువానలు...నీట మునిగిన పంటలు !