కడప జిల్లా మైదుకూరు మండలం బసవాపురం టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బద్వేలు పురపాలికలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొండపల్లి మోహన్‌బాబు మృతి చెందాడు. మైదుకూరు పట్టణ సమీప పార్వతీనగర్‌కు చెందిన మోహన్‌బాబు అనే వ్యక్తి విధులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తున్న సమయం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మోహన్‌బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి... : 'నన్ను అవిటి వాడిని చేశారు... వారిని శిక్షించండి'