Dastagiri : వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతొంది. సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ కాగా.. సీబీఐ విచారణ వేగవంతం చేసింది. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని మలిదశ విచారణలో సీబీఐ విచారిస్తోంది. ఆదివారం కడప కారాగారంలోని అతిథిగృహంలో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి సీబీఐ ఎదుట హాజరయ్యాడు. చాలా రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ విచారణలో పాల్గొన్నాడు. ఇంతకాలం దస్తగిరి చెప్పింది అబద్ధమన్నారని.. నిజాలేంటో ఇకముందు తెలుస్తాయని దస్తగిరి వెల్లడించాడు. హైదరాబాద్‌కు కేసు బదిలీ చేయడంపై స్పందిస్తూ.. కేసును సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయటం మంచి పరిణామామేనని తెలిపాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో.. వివేకా హత్య కేసులో ఐదుగురు నిందితులు హాజరుకానున్నారు.
అన్ని నిజాలు త్వరలోనే బయటికి వస్తాయని అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు కావాలని అధికారులు సమన్లు అందించగా.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహం నుంచి వచ్చి సమన్లు అందుకున్నాడు. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అన్నాడు. అధికారులు అడిగై ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నాడు. సీబీఐ అధికారులు పక్క సమాచారంతోనే విచారణకు పిలుస్తున్నారని దస్తగిరి పేర్కొన్నాడు. అందులో భాగంగానే అవినాష్ రెడ్డిని విచారించారని వివరించాడు. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంటానేది సీబీఐ త్వరలోనే వెల్లడిస్తుందని తాను నమ్ముతున్నానని దస్తగిరి తెలిపాడు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే విచారణ ఆలస్యమైందన్నాడు. ఇప్పుడు తెలంగాణకు బదిలీ కావటం మంచి పరిణామామని తెలిపాడు. జగన్ తలచుకుని ఉంటే పదిరోజుల్లోనే వివేకా హత్య కేసు తెేలిపోయేదని.. పట్టించుకోలేదని వ్యాఖ్యనించాడు. అన్ని విషయాలు కోర్టులోనే చెబుతానని.. రాష్ట్రమంతా నిజం కోసం వేచి చూస్తోందని వెల్లడించాడు.
ఇవీ చదవండి :