దసరా ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారుల ఆదేశాలను పాటిస్తూ నిర్వాహకులు దసరా ఉత్సవాలు జరుపుతున్నారు. కడప అమ్మవారి శాలలో భక్తులకు గజలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఐదు లక్షల రూపాయల నగదుతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. అలాగే విజయదుర్గ దేవి ఆలయంలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
ఇవీ చూడిండి...