ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 31 మంది అరెస్టు - ప్రాద్దుటూరు తాజా వార్తలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో బెట్టింగ్​కు పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్​లైన్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

cricket betting bookies arrested in prodduttooru kadapa district
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్
author img

By

Published : Dec 16, 2020, 5:24 PM IST

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 31 మందిని కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదు, ఆరు కిలోల గంజాయి, రెండు కార్లు, ఏడు ల్యాప్​టాప్​లు, 8 కాలిక్యులేటర్లు, రెండు కమ్యూనికేటర్లు, అకౌంట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

కడప జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 31 మంది క్రికెట్ బుకీలు... దేశంలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్​లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ నిర్వహించడమే కాకుండా గంజాయి విక్రయిస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కొందరు పరారీలో ఉన్నారని, వారికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ల పంపిణీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.