దేశంలో ఆర్ఎస్ఎస్ పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కడప జిల్లా రాయచోటిలో మైనారిటీల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కోట్లాది మంది మైనార్టీల మనోభావాలు దెబ్బతీసేలా పౌరసత్వ చట్టం తీసుకొచ్చారని రామకృష్ణ ఆక్షేపించారు. 13 రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయన్నారు. కానీ రాష్ట్రంలో మైనారిటీ ఓట్లు పొంది గెలిచిన వైకాపా ఎంపీలు పార్లమెంట్లో మద్దతు పలకటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని మాత్రమే బిల్లును వ్యతిరేకించారని... ప్రతి ముస్లిం ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మైనార్టీ సోదరులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
'పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి'
మైనారిటీ ఓట్లతో గెలిచిన వైకాపా ప్రభుత్వం... పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిందని సీపీఐ రామకృష్ణ అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన మైనారిటీల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
దేశంలో ఆర్ఎస్ఎస్ పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కడప జిల్లా రాయచోటిలో మైనారిటీల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కోట్లాది మంది మైనార్టీల మనోభావాలు దెబ్బతీసేలా పౌరసత్వ చట్టం తీసుకొచ్చారని రామకృష్ణ ఆక్షేపించారు. 13 రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయన్నారు. కానీ రాష్ట్రంలో మైనారిటీ ఓట్లు పొంది గెలిచిన వైకాపా ఎంపీలు పార్లమెంట్లో మద్దతు పలకటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని మాత్రమే బిల్లును వ్యతిరేకించారని... ప్రతి ముస్లిం ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మైనార్టీ సోదరులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:
ఐకాస మహిళా సభ్యులపై ఎంపీ సురేశ్ అనుచరుల దాడి