ETV Bharat / state

CPI Ramakrishna On PRC: వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: సీపీఐ రామకృష్ణ - ఉద్యోగుల ఆందోళన

CPI Ramakrishna On PRC: ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన సీఎం..ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
author img

By

Published : Dec 7, 2021, 4:40 PM IST

వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

CPI Ramakrishna On PRC: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులు రెండున్నరేళ్లుగా చాలా సంయమనంతో ఉన్నారని..వారికి ఓపిక నశించటం వల్లే ఇప్పుడు ఉద్యమబాట పట్టారని అన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీని అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఎందుకు నిర్ణయం తీసుకోవటం లేదని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చీలికలు తెచ్చే విధంగా కొందరు నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని రామకృష్ణ హితవు పలికారు.

ప్రారంభమైన పోరు..

పీఆర్సీ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలోనూ నిరసనలు తెలపారు. నిరసనల్లో భాగంగా పలుచోట్ల ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Employees Protest: 'కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం.. ఇబ్బందులకు గురి చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.