CPI PADAYATRA : సీపీఐ తలపెట్టిన ఉక్కు పాదయాత్రను మాండౌస్ తుపాను కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. డిసెంబర్ 27నుంచి నాలుగు రోజుల పాటు పాదయాత్రను తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడాన్ని.. నిరసిస్తూ ఈనెల 12న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ ఎంపీ బినయ్ విశ్వం హాజరయ్యారు.
ఇవీ చదవండి: