కడప జిల్లా కోటరెడ్డి కూడలి వద్ద సీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సిద్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయిందని.. ఇప్పటికైనా అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.
రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. రాయలసీమ ప్రాజెక్టులకు కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీవో 203ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: