భార్య అనారోగ్యంతో బాధపడుతోందని భర్త విలవిల్లాడిపోతున్నాడు. ఆమెను కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఓవైపు లాక్ డౌన్, మరోవైపు స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ.. ఇక చేసేది లేక భార్య రెడ్డమ్మను తోపుడు బండిపై ఉంచి యాచిస్తున్నాడు కడపకు చెందిన హరిహర రెడ్డి.
వీరికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. కొంతకాలం బాగానే జీవించారు. పరిస్థితులు అనుకూలించక చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించారు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట భార్య రెడ్డెమ్మ ప్రమాదవశాత్తు కింద పడి తలకు బలమైన గాయమైంది. వెంటనే చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి కర్నూలుకు తీసుకెళ్లాలని పంపించేశారు. భార్యాభర్తలిద్దరు యాచించి 2,700 రూపాయలు నగదు జమ చేసుకున్నారు. కడపలోని ఓ వృద్ధాశ్రమంలో కొద్దిరోజులు తలదాచుకున్నారు. ఇంతలో కరోనా కారణంగా.. వారిని అక్కడి వారు బయటకు పంపించారు.
ఇక చేసేది లేక భార్యను తోపుడు బండి వేసుకుంటూ నగరంలో తిరుగుతున్నాడు. కర్నూలుకు తీసుకెళ్తేనే తన భార్య బతుకుతుందని... తన ఆర్థిక స్థితి బాలేదని హరిహరరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వమే తమపై దయ చూపించాలని వేడుకుంటున్నాడు.
ఇదీ చూడండి: