కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో జోన్-4లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతుల కౌన్సెలింగ్ నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జోన్-4లో ఉన్న కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ నిలుపుదల చేయాలని విద్యాశాఖకు చెందిన రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ పదోన్నతులకు సంబంధించి సీనియారిటి జాబితాలను, అభ్యంతరాల పరిశీలనను రూపొందించుకోవాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి
Badvel Bypoll: బద్వేలులో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించొద్దు: ఈసీ