అధికార పార్టీ నేతల అండదండలతో చిన్నమండెం ఎస్సై మైనుద్దీన్ అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ పీసీసీ సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా రాయచోటిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నమండెం పరిధిలో అక్రమాలపై విచారణ జరపాలని అన్నారు.
'కానిస్టేబుళ్లతో కలిసి వసూళ్లు'
ఎస్సై మైనుద్దీన్ ఆదేశాల మేరకు స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్స్ చిరంజీవి, అత్తర్ అలీఖాన్... నాటు సారా, అక్రమ ఇసుక రవాణా, నిషేధిత గుట్కా అక్రమ రవాణాకు సహకరిస్తూ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్నమండెం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మహిళలు, దళితులతో ప్రవర్తన బాలేదని చాలా మంది తన దృష్టికి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఎస్సైపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.
ఇదీ చదవండి:
బ్యాంకుకు వెళ్లే మహిళలే టార్గెట్.. సీసీ కెమెరా ఉన్నా పట్టించుకోడు!