కరోనా సమయంలో తొమ్మిది నెలల పాటు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించినా.. ఒక్క నెలకూ జీతం ఇవ్వలేదని కడపలో స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
నెలల తరబడి కుటుంబాలకు దూరమై, పిల్లలను చూడకుండా పనిచేసినా.. తమ కష్టాన్ని గుర్తించలేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్దకు వెళ్తే తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేశారని కంటతడి పెట్టుకున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్తే డీసీహెచ్ఎస్ కార్యాలయానికి.. అక్కడికి వెళ్తే డీఎంహెచ్‌వోకు వెళ్లమని తిప్పారని వాపోయారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: