కడప జిల్లా సంబేపల్లె మండలం పాలెంగడ్డ హరిజనవాడకు చెందిన మహిళకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధిత మహిళ కుటుంబసభ్యులను, ఆమెతో సన్నిహితంగా ఉన్న 31 మందిని కరోనా పరీక్షలకు కడప ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలించారు. సంబేపల్లె మండలంలో ఇది రెండో కరోనా పాజిటివ్ కేసు అని అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన వైకాపా నేత