ETV Bharat / state

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వివాదం.. కూల్చివేస్తామన్న భాజపా

author img

By

Published : Jun 19, 2021, 8:12 AM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్ర‌హా ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్​ రెడ్డి భూమిపూజ చెయ్య‌డం వివాదాస్ప‌దంగా మారింది. విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని భాజ‌పా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్య‌తిరేకించారు. వేల మందిని ఊచ‌కోత‌కోసిన టిప్పు సుల్తాన్ విగ్ర‌హాన్ని పట్టణంలో ఎలా పెడతారని ఆయన నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహా ఏర్పాటును అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

vishnu vardhan reddy on tipu sultan statue
భాజపా నేత విష్ణు వర్ధన్ రెడ్డి

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటుకు ఎమ్యెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్​రెడ్డి భూమి చేయడాన్ని నిరసిస్తూ భాజ‌పా నేత‌లు ఆందోళ‌న చేపట్టారు. దీన్ని భాజ‌పా పూర్తిగా వ్య‌తిరేకిస్తోందని భాజ‌పా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి మండిపడ్డారు. వేల మందిని ఊచ‌కోత‌కోసిన టిప్పు సుల్తాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చెయ్య‌డం బాధాక‌ర‌మ‌న్నారు. టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చెయ్య‌డం వెనుక కుట్ర‌దాగి ఉంద‌న్నారు. ఓట్ల కోస‌మే టిప్పు సుల్తాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నార‌న్న ఆయ‌న.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కూడా సుల్తాన్‌గా ప్ర‌వర్తిస్తున్నార‌ని ఆరోపించారు. విగ్రహా ఏర్పాటుపై ఎమ్మెల్యే శివ‌ప్ర‌సాద్​రెడ్డితో పాటు మఖ్యమంత్రి వివరణ ఇవ్వాలన్నారు.

వినతి పత్రం అందజేత..

టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వద్దని.. జిల్లా నాయ‌కుల‌తో క‌లిసి పట్టణ క‌మిష‌న‌ర్ రాధ‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంతరం పుర‌పాలక కార్యాల‌యం నుంచి టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన ప్ర‌దేశాన్ని పరిశీలించడానికి వెళ్తుండ‌గా విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డితో పాటు నాయ‌కుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త‌త వాతావరణం ఏర్ప‌డింది.

'భార‌త ప్ర‌భుత్వ రాజ్యాంగం అమ‌లు కావ‌డం లేద‌ు'

ఇదివరకే ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలో ధౌర్జ‌న్యంగా ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌పై క‌మిష‌న‌ర్​కు భాజ‌పా ఫిర్యాదు చేసినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని.. విష్ణువ‌ర్ధ‌న్‌ రెడ్డి ఆరోపించారు. ప‌ట్ట‌ణంలో అక్ర‌మ విగ్ర‌హాల ఏర్పాటు వెనుక ఎమ్మెల్యే పాత్ర ఉంద‌ని అన్నారు. ఫిర్యాదులు తీసుకోవ‌డానికి కూడా క‌మిష‌న‌ర్ భ‌య‌ప‌డుతున్నార‌న్నారని.. ప్రొద్దుటూరు పుర‌పాలిక‌లో భార‌త ప్ర‌భుత్వ రాజ్యాంగం అమ‌లు కావ‌డం లేద‌ని ఆరోపించారు. అనేక చ‌రిత్ర క‌లిగిన ప్రొద్దుటూరులో దేశ‌ద్రోహ విగ్ర‌హాలు ఏర్పాటు చెయ్య‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న వ్య‌క్తులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

నా సోదరుడి మృతిపై అనుమానాలున్నాయి: మావోయిస్టు గంగయ్య సోదరుడు

దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.