ETV Bharat / state

'ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది' - వ్యవసాయరంగంపై తులసిరెడ్డి వ్యాఖ్యల వార్తలు

వైకాపా ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేేసేందుకు తమను ప్రభుత్వం సూచనలు అడిగిందని.. తాము నిర్దుష్టమైన సూచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

congress leader tulasireddy on agriculture
తులసిరెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్
author img

By

Published : May 26, 2020, 4:26 PM IST

వైకాపా ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడారు. మ్యానిఫెస్టో ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి 12,500 రూపాయలు ఇవ్వాలని.. అయితే అందులో 5 వేల రూపాయలు కోత విధించారని అన్నారు. రైతు రుణమాఫీ కింద 8 వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్​లో ఉన్నాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై సూచనలు ఇవ్వమని ప్రభుత్వం అడిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్దుష్టమైన సూచనలు చేస్తుందన్నారు.

'రైతు భరోసా క్రింద 12,500 రూపాయలు ఇవ్వాలి.

పెండింగ్​లో రైతు రుణమాఫీ 8 వేల కోట్లు విడుదల చేయాలి.

ధరల స్థిరీకరణ నిధిని సక్రమంగా అమలు చేయాలి.

వ్యవసాయ, సాగునీటి రంగానికి వచ్చే ఏడాది అధిక నిధులు కేటాయించాలి' ఇవే ప్రభుత్వానికి తాము ఇచ్చే సూచనలని చెప్పారు.

ఇవీ చదవండి.. 'వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.