రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చే వరకు మాయమాటలు చెప్పిన జగన్.. ఇప్పుడు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతోందన్నారు. సర్దుబాటు ట్రూప్ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై 3వేల 669 కోట్ల రూపాయలు అదనపు భారం మోపారని దుయ్యబట్టారు. సీఎం జగన్ వైఖరి కరోనా నేపథ్యంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే పుండు మీద కారం చల్లినట్లు ఉందన్నారు.
మద్యం షాపులు, సినిమా హాళ్లు తెరిచేందుకు అడ్డురాని కరోనా.. వినాయక చవితి వేడుకలకు అడ్డువస్తుందా అని తులసి రెడ్డి ప్రశ్నించారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: