ETV Bharat / state

15 ఏళ్లుగా ఒక్క సెలవు పెట్టని లేడీ కండక్టర్.. ఆమె చిత్తశుద్ధికి ఆర్టీసీ ఫిదా - 15 ఏళ్లుగా ఒక్క సెలవు కూడా పెట్టని కండక్టర్ న్యూస్

Best Lady Conductor: ప్రయాణికులు బస్సు కోసమే ఎదురు చూస్తారు కానీ కొంతమంది ప్రయాణికులు మాత్రం ఆ మహిళా కండక్టర్ కోసం ఎదురు చూస్తారు. ప్రతిరోజు తెల్లవారగానే విధులకు వెళ్లే వారందరూ ఆ మహిళా కండక్టర్ ఉన్న బస్సునే ఎక్కాలని అనుకుంటారు. అంతలా అందరినీ ఆకట్టుకున్న ఆ కండక్టర్ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తోంది. దీంతోపాటు గత 15 ఏళ్ల నుంచి ఆమె ఒక్క సెలవు కూడా పెట్టకుండా విధులు నిర్వహిస్తోంది. మరి ఆ మహిళా కండక్టర్ ఎవరు? ఏమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం రండి..

ysr kadapa Women Conductor special story
మహిళా కండక్టర్ స్పెషల్ స్టోరీ
author img

By

Published : Mar 8, 2023, 10:11 AM IST

Updated : Mar 8, 2023, 7:46 PM IST

మహిళా కండక్టర్ స్పెషల్ స్టోరీ

Best Lady Conductor: ఎక్కడైనా ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తారు. అయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో కొంతమంది ప్రయాణికులు మాత్రం ఆ కండక్టర్ కోసమే ఎదురుచూస్తారు. ఆమె ఉన్న బస్సును మాత్రమే ఎక్కేందుకు ఇష్టపడతారు. అందరి మన్నలను అందుకున్న ఆ మహిళా కండక్టర్ పేరు రాములమ్మ. ఈమె వైఎస్ఆర్ కడప ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త సుబ్బారెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, వారిద్దరూ ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున భర్త సుబ్బారెడ్డి ఆమెను వాహనంపై తీసుకొచ్చి బస్టాండ్ వద్ద వదిలిపెట్టి వెళ్తారు. ఆమె టికెట్ల బాక్సు, టిమ్స్ పరికరాన్ని తీసుకొచ్చి.. తనకు కేటాయించిన బస్సు వద్దకు వెళ్లి ప్రయాణికులను ఆప్యాయంగా పలకరిస్తూ బస్సు ఎక్కిస్తుంది.

ఆమె 1997లో మహిళా కండక్టర్​గా విధుల్లో చేరారు. కరోనాకు ముందు 15 ఏళ్ల నుంచి ఆమె ఒక్క సెలవు కూడా పెట్టకుండా విధులను నిర్వహించారు. చివరికి ఆఫ్ రోజు కూడా వచ్చి విధులు నిర్వహించారు. బస్ వద్ద నిలబడి మరీ.. ఊర్ల పేర్లు చెప్పి ప్రయాణికులను నవ్వుతో పలకరిస్తూ ఆహ్వానించేది. ప్రయాణికులతో సరదాగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను తెలుసుకునేది. గతంలో కూడా రాములమ్మ చేస్తున్న విధులను హర్షిస్తూ అధికారులు అభినందించి ఆమెకు అవార్డులు కూడా బహుకరించారు. రాములమ్మ లాంటి సాటి కండక్టర్ కడప డిపోలో ఉండడం మా అదృష్టమని, ఆమె 15 ఏళ్ల నుంచి ఒక్క సెలవు కూడా పెట్టకుండా విధులు నిర్వహిస్తోందని, పైగా కలెక్షన్లు కూడా బాగా తీసుకొస్తుందని సాటి మహిళా కండక్టర్లు కొనియాడారు.

తనకున్న ఇద్దరు పిల్లలు చిన్నతనం నుంచి బయటి ప్రాంతాలలో చదువుతూ ఉండేవారని ఆమె తెలిపారు. దీంతో ఇంటిపట్టున ఉండలేక పిల్లల ఫీజుకు డబ్బులు పనికొస్తాయనే ఉద్దేశంతో కూడా 15 ఏళ్ల నుంచి ఒక్క సెలవు పెట్టకుండా విధులు నిర్వహించానని రాములమ్మ పేర్కొన్నారు. మొదటి విడత కరోనా రావడంతో అప్పుడు సెలవులు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. అధికారులు కూడా చక్కగా సహకరించారని ఆమె చెప్పారు.

"నేను పదిహేనేళ్లుగా ఒక్కసారి కూడా సెలవు పెట్టుకోలేదు. అందుకు నా ఆరోగ్యం సహకరించటంతో పాటు మా అధికారులు కూడా సహకరించారు. మా పిల్లలు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఏటా మా డిపోలో నాకు అవార్డులు ఇస్తారు." - రాములమ్మ, మహిళా కండక్టర్, కడప డిపో.

మహిళా కండక్టర్ రాములమ్మ 15 ఏళ్లపాటు ఒక్క సెలవు పెట్టకుండా విధులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కండక్టర్లను మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలని ఇలాంటి వారిని అభినందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని జిల్లా రవాణా శాఖ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ.. విధులను ఎగ్గొట్టి తిరగాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి కాలంలో రాములమ్మ లాంటి మహిళా కండక్టర్ ఉండడం చాలా అరుదు. రాములమ్మ లాంటి మహిళా కండక్టర్ ఆర్టీసీకి దొరకడం అధికారులు చేసుకున్న అదృష్టం.

ఇవీ చదవండి:

Last Updated : Mar 8, 2023, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.