ETV Bharat / state

గ్రామస్థుల ఆందోళన.. క్వారీ నుంచి వెనుదిరిగిన ఇసుక లారీలు

కడప జిల్లా కమలాపురం మండలంలో 80 ఇసుక లారీ, టిప్పర్లను గ్రామాల ప్రజలు, మహిళలందరూ అడ్డుకుని ఆందోళన చేపట్టారు. భారీ వాహనాల రద్దీతో ఏర్పడే కాలుష్యం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన చెందారు.

Concerned villagers Sand lorries back from the quarry
గ్రామస్థుల ఆందోళనతో.. క్వారీ నుంచి వెనుదిరిగిన ఇసుక లారీలు
author img

By

Published : Mar 22, 2021, 5:05 PM IST

కడప జిల్లా కమలాపురం మండలంలోని నసంతపురం, చిన్నరెడ్డిపల్లి, నడింపల్లి గ్రామాల్లో రోజూ సుమారు 80 వరకు ఇసుక టిప్పర్లు, లారీలు తిరుగుతున్నాయి. ఈ వాహనాల రద్దీతో రోడ్డు పూర్తిగా పాడైపోతోందని.. దుమ్ము, ధూళి ఇళ్లల్లోకి చేరి అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్థులు చెప్పారు. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినా వాహనదారులు పట్టించుకోవట్లేదన్నారు.

ఈ సమస్యపై.. స్థానికులు, చుట్టు పక్కల గ్రామస్థులు.. వాహనాలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు చెప్పినా.. వాహనాదారులు స్పందించకుండా వెళ్తున్నారని ఆందోళన చెందారు. రోడ్డు పాడైపోతోందన్నారు. లారీల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాల్సిన లారీలు వెను దిరిగి వెళ్లిపోయాయి.

ఇదీ చదవండి:

'ఫ్రంట్ లైన్ వారియర్స్​ను వేధింపులకు గురిచేయడం బాధాకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.