ETV Bharat / state

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు.. లొంగిపోయిన నిందితుడు

సీఎంఆర్​ఎఫ్ నకిలీ చెక్కుల కేసు
సీఎంఆర్​ఎఫ్ నకిలీ చెక్కుల కేసు
author img

By

Published : Sep 24, 2020, 5:15 PM IST

Updated : Sep 24, 2020, 7:57 PM IST

17:12 September 24

సీఎంఆర్​ఎఫ్ నకిలీ చెక్కుల కేసు

సీఎంఆర్​ఎఫ్ నకిలీ చెక్కుల కేసులో లొంగిపోయిన నిందితుడు భాస్కర్ రెడ్డి

సీఎంఆర్​ఎఫ్ న‌కిలీ చెక్కుల కేసులో ప్ర‌ధాన నిందితుడు భాస్కర్​ రెడ్డి క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు పోలీసుల ముందు లొంగిపోయాడు. చాపాడు మండ‌లానికి చెందిన భాస్క‌ర్ రెడ్డి...ప్రొద్దుటూరు గ్రామీణ పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. మ‌రో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు స‌మాచారం.  

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల‌తో బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేశార‌న్న వ్య‌వ‌హారంపై బుధవారం ప్రొద్దుటూరులోని మూడు పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోదయ్యాయి. వేరువేరు బ్యాంకుల్లో మూడు న‌కిలీ చెక్కుల‌తో ప‌ది ల‌క్ష‌లు డ్రా చేసిన‌ట్లు బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో లొంగిపోయిన‌ ప్ర‌ధాన నిందితుడు భాస్క‌ర్‌రెడ్డి.. మూడు చెక్కుల‌తో డ‌బ్బులు డ్రా చేసిన‌ట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.  

ఇదీ చదవండి :   తప్పించుకు తిరుగుతున్న రిమాండ్ ఖైదీ హరీశ్ రెడ్డి అరెస్ట్

Last Updated : Sep 24, 2020, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.