CM Jagan Kadapa Tour Passengers Problems: సీఎం జగన్ పర్యటన వేళ కడప ఆర్టీసీ బస్టాండ్ లోకి బస్సులు రాకుండా దారి మళ్లించడంతో నిర్మానుష్యంగా మారింది. వివిధ జిల్లాల నుంచి కడపకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ శివారు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండుకు వచ్చి వెనుదిరిగారు.
CM Jagan Kadapa Tour: శివారు ప్రాంతంలో బస్సులు నిలిపివేయడంతో ఆటోలకు అధిక ఛార్జీలు వెచ్చించి వెళ్లాల్సి పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. సీఎం పర్యటన మధ్యాహ్నం అయితే ఉదయం నుంచే బస్సులు నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం వస్తే బస్సులు దారి మళ్లించాల్సిన అవసరం ఏంటని జనం నిలదీశారు. సీఎం పర్యటించే ప్రాంతాల వద్ద బారికేడ్లు, పరదాలూ పోలీసులు ఏర్పాటు చేశారు.
'సీఎం జగన్ ఏం మొహం పెట్టుకొని కడప పర్యటనకు వస్తున్నారు!'
కమలాపురం నియోజకవర్గాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని సీఎం జగన్‌కు వినతిపత్రం ఇస్తామంటూ రైతులతో కలిసి ర్యాలీ చేపట్టిన టీడీపీ నేత కాశీభట్ల సాయినాథ్ శర్మను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు అఖిలపక్ష పార్టీ నాయకులు కడప హరిత హోటల్ నుంచి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా, తోపులాట జరిగింది. పోలీసులు అఖిలపక్ష పార్టీ నాయకులు అందర్నీ అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
12 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వద్దకు కడప డీఎస్పీ షరీఫ్ వెళ్లి ముఖ్యమంత్రిని కలిసేందుకు కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. అంగన్వాడీలు పదిమంది వస్తామని చెప్పడంతో పోలీసులు ఒప్పుకోలేదు. అంగన్వాడీలను ICDS (Integrated Child Development Services) అర్బన్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు పెట్టారు. పోలీసులు తీసుకువచ్చిన భోజన ప్యాకెట్లను వద్దన్న అంగన్వాడీలు, తమ ఆకలి బతుకులు ముఖ్యమంత్రి జగన్‌కి తెలియాలంటూ అన్నం ప్యాకెట్లను వెనక్కి పంపించారు.
సీఎం జగన్ ప్రారంభించి వెళ్లక ముందే ఇలా పెచ్చులూడిపోయాయి- నాసిరకం పనులపై ఆగ్రహావేశాలు
"ముఖ్యమంత్రి జగన్ వస్తారని పది కిలోమీటర్ల ముందే బస్సులను ఆపేస్తే ఎట్లా. ప్రజలకు ఇబ్బందులు కదా. ప్రజలకు సేవ చేసే వ్యక్తి నాయుకుడు అవుతారు, ప్రజలను ఇలా ఇబ్బందులు పెట్టే వ్యక్తి ఏం నాయుకుడు". - ప్రయాణికుడు
"జగన్ వస్తున్నారని బస్సులను ఆపేశారు. దూరం నుంచి వచ్చే వాళ్లు కూడా ఉన్నారు. జగన్ వస్తే ప్రజలకు మంచి జరగాలి కానీ ఇలా కష్టాలు పెట్టకూడదు. గతంలో కడపకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఈ విధంగా ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టే ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా దారుణం. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి". - ప్రయాణికుడు
సీఎం జగన్ కడపకు - కడప జనం నగర శివారుకు 'ఇదేంది జగనన్నా?