కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో... ఇంజనీరింగ్ విద్యార్థులు మధ్య ఘర్షణ నెలకొంది. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేశారంటూ.. మూడో సంవత్సరం విద్యార్థులు గళమెత్తారు. ప్రసాద్ చంద్ర, తేజ, వంశీ, చరణ్, శివాజీ సహా ఇంకొందరు నాలుగో సంవత్సరం విద్యార్థులు.. జూనియర్ల వసతి గృహానికి వెళ్లారు. తమ వెంట తీసుకెళ్లిన క్రికెట్ బ్యాట్లు, సైకిల్ చైన్లు, ఇతర వస్తువులతో మూకుమ్మడిగా దాడి చేశారు.
ట్రిపుల్ ఐటీ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. సీనియర్లు లెక్క చేయకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన జూనియర్లు మూర్తి, శేషు, రాజులను సిబ్బంది హుటాహుటిన స్ధానిక ఆర్కే వ్యాలీ ఆసుపత్రికి తరలించారు
ఇదీ చదవండీ...ఎస్ఈబీ ఏఎస్పీ వీరంగం : మద్యం మత్తులో హల్చల్