ETV Bharat / state

ఆప్కో మాజీ ఛైర్మన్​ ఇంట్లో సీఐడీ సోదాలు... బంగారం, నగదు స్వాధీనం - apco ex chairman news

ఆప్కో మాజీ ఛైర్మన్​ గుజ్జల శ్రీనివాస్​ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. తిరుపతికి చెందిన సీఐడీ అధికారుల బృందం ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసి భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

cid-officers-searches-in-apco-ex-chairman-house-in-kadapa
ఆప్కో మాజీ ఛైర్మన్​ ఇంట్లో సీఐడీ సోదాలు... బంగారం, నగదు స్వాధీనం
author img

By

Published : Aug 21, 2020, 3:03 PM IST

Updated : Aug 21, 2020, 8:39 PM IST

ఆప్కో మాజీ ఛైర్మన్​ గుజ్జల శ్రీనివాస్ ఇంట్లో సీఐడీ అధికారులు భారీగాబంగారం, నగదు పట్టుకున్నారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. ఆప్కోలో అక్రమాలపై విచారణ చేస్తున్న సీబీ సీఐడీ... ఈ సోదాలు చేసింది.

cid-officers-searches-in-apco-ex-chairman-house-in-kadapa
ఆప్కో మాజీ ఛైర్మన్​ ఇంట్లో సీఐడీ సోదాలు... బంగారం, నగదు స్వాధీనం

ఈ తనిఖీల్లో గుజ్జల శ్రీనివాస్ ఇంట్లో కోటి రూపాయల నగదు, 3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు గత కొంతకాలంగా విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు.. శుక్రవారం కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై మంగళగిరి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది.

తిరుపతికి చెందిన సీఐడీ అధికారుల బృందం... గుజ్జల శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. తమ విచారణ నివేదికను కోర్టుకు సమర్పిస్తామని సీఐడీ డీఎస్పీ తెలిపారు.

ఈ విచార‌ణ‌లో భాగంగా తిరుప‌తి, నెల్లూరుకు చెందిన సీఐడీ అధికారులు ప్రొద్దుటూరులో త‌నిఖీలు చేశారు. నెహ్రూరోడ్డులోని చేనేత స‌హ‌కార సొసైటీల అకౌంటెంట్ శ్రీరాములు ఇంట్లో జ‌రిగిన సోదాల్లో 20 తులాల బంగారం, 2 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు, ప‌లు ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు. గుజ్జ‌ల శ్రీనివాస్ ముఖ్య అనుచ‌రుడు, రాఘ‌వేంద్ర, చేనేత సొసైటీ అధ్య‌క్షుడు కొండ‌య్య ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు. అయితే కొండ‌య్య ఇంట్లో ఎలాంటి వ‌స్తువులు, ప‌త్రాలు అధికారుల‌కు ల‌భ్యం కాలేదు.

ఇదీ చూడండి..

సీఎం జగన్ మాట తప్పారు: దేవినేని ఉమ

Last Updated : Aug 21, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.