cm jagan tour : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ 15 వ తేదిన పర్యటించనుండగా కన్య తీర్థం వద్ద ఏర్పాట్లను సిద్ధం చేశారు. రెండు హెలిపాడ్లతో పాటు సభా ప్రాంగణం, ఉక్కు పరిశ్రమ పనులకు భూమి పూజ ఏర్పాట్లను పూర్తి చేశారు.
భారీ బందోబస్తు... సీఎం జగన్ బుధవారం ఉదయం 10.15 గంటలకు విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె చేరుకుంటారు. 11.35 గంటలకు ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేస్తారు. 12.45 గంటల వరకు ఉక్కు పరిశ్రమకు సంబంధించి సమీక్ష చేస్తారు. 1.05 గంటలకు హెలికాఫ్టర్లో బయలుదేరి పులివెందుల పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగే వేడుకలకు హాజరవుతారు. కన్యతీర్థం వద్ద ఏర్పాటు చేసిన సభకు ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 700 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు. సీఎం సభ కోసం 500 మందికి పాసులు ఇచ్చామని వారే హాజరు కావాలని తెలిపారు. మంగళవారం జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై పనులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయితే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ.. సీఎం పర్యటన ఏర్పాట్ల పనులను ఎంపీ అవినాష్ రెడ్డి ఒక రోజు ముందుగానే సోమవారం పరిశీలించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి భూమి పూజ కార్యక్రమాలకు సంబంధించి పనులను పరిశీలించారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న పనుల గురించి అధికారులతో చర్చించారు. కన్యతీర్థం వద్ద రెండు హెలీపాడ్లను ఏర్పాటు చేయనున్నారు. సీఎం, జేఎస్ డబ్ల్యూ కంపెనీ ప్రతినిధులకు వేర్వేరుగా రెండు హెలీపాడ్లను తయారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున భారీ బహిరంగ సభ కాకుండా కంపెనీ ప్రతినిధులతో కలిసి సీఎం హాజరు కానున్నట్లు తెలిసింది. కేవలం 500 మందితో చిన్నపాటి సభ ఏర్పాటు చేసి, ఉక్కు పనులకు భూమి పూజ చేస్తారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
కడపలో ఉక్కుపరిశ్రమకు పలుమార్లు భూమిపూజలు.. జమ్మలమడుగులో శంకుస్థాపన చేస్తున్న ఉక్కు పరిశ్రమకు గతంలో 2019 డిసెంబర్ 23 సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఇదే ఉక్కు పరిశ్రమకు గత ప్రభుత్వ హయంలో మాజీ సీఎం చంద్రబాబు 2018 డిసెంబర్ 27 న శంకుస్థాపన చేశారు. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 జూన్ 10 న భూమి పూజ చేశారు.
ఇవీ చదవండి :