కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కడప జిల్లాలో 3 రోజుల పర్యటన కోసం బుధవారం సాయంత్రం ఇడుపులపాయ చేరుకున్న జగన్... ఈ ఉదయం వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. తన తండ్రి సమాధిపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఇడుపులపాయ చర్చికి వెళ్లారు.
ఈ మధ్యాహ్నం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్, బస్ డిపోలకు పునాది రాయి వేయనున్నారు. అనంతరం అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చదవండి: