ETV Bharat / state

ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు - పెరిగన చికెన్ ధరలు తాజా వార్తలు

నాన్​వెజ్ ప్రియులకు చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే కేజీకి 30 నుంచి 40 రూపాయలు పెరగటంతో.. మాంసాహార ప్రియులు అల్లాడుతున్నారు.

chicken prices increases
పెరిగన చికెన్ ధరలు
author img

By

Published : Apr 5, 2021, 1:59 PM IST

Updated : Apr 5, 2021, 4:12 PM IST

పెళ్లిళ్లు లేవు.. పండగలు లేవు.. వేడుకల సమయం కూడా కాదు.. కాని చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. ఎందుకిలా దూసుకెళ్తున్నాయి అంటే.. ఎండాకాలం అని చికెన్‌ దుకాణదారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగినట్టు సరఫరా లేకపోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయంటున్నారు. రవాణా ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం కూడా కారణమని కోళ్ల పరిశ్రమ నిపుణుడు శ్రీకాంత్‌ చెబుతున్నారు.

గత ఆదివారం స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 210 ఉండగా.. ఈ వారం ధర రూ. 260కి తక్కువ లేకుండా అమ్ముడైంది. కొన్ని చోట్ల స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 270, రూ. 280 వరకూ అమ్మారు. లైవ్‌ కూడా గత వారం రూ. 125 ఉండగా.. ఈ ఆదివారం రూ. 160కి తగ్గలేదు. సోమవారం కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 270 దాటుతుందని దుకాణ దారులు చెబుతున్నారు.

ఊరటనిస్తున్న గుడ్లు..

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోడి కూర తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉడకబెట్టిన రెండు గుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే గుడ్ల ధరలు పెరగకపోవడం ప్రజలకు ఊరటే. గతవారం డజను గుడ్ల ధర రూ. 60 ఉండగా.. ఈ వారం కూడా అంతే ఉంది. అయితే గుడ్డు ధర పెరిగినా అది పైసల్లోనే ఉంటుందంటున్నారు. ఎటొచ్చీ చికెన్‌ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. దీంతో కొనుగోళ్లు తగ్గాయని దుకాణదారులు చెబుతున్నారు.

మరింత పెరిగే అవకాశం..

ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఈ కాలంలో కోళ్లు ఎండలకు తట్టుకోలేవని.. వాటి నిర్వహణ భారమని చాలా వరకూ కోళ్ల ఫారాలను ఖాళీ చేస్తారు. చిన్న రైతులు, చిన్నమొత్తంలో పెంపకందారులు ఎండాకాలం నిర్వహణ భారమంటూ కోళ్ల పెంపకాన్ని ఆపేస్తారు. అంతేగాక కోళ్ల దాణాకు అవసరమైన సోయాకేకు ఇతరత్రా ముడిసరకు ధరలు 30-40 శాతం వరకూ పెరిగాయని పెంపకందారులు చెబుతున్నారు. దీనికి తోడు కోళ్లకు తెగుళ్లు కూడా ఎక్కువయ్యాయని.. ఇలా అనేక కారణాలతో కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పరిశ్రమకు చెందిన వారు పేర్కొంటున్నారు. మే నెలలో శుభకార్యాలు మొదలుకానున్న నేపథ్యంలో కోడి ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. పెరిగిన రేట్లతో కొనలేక చికెన్ కొనలేక... తినకుండా ఉండలేక నాన్ వెజ్ ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు.

కడపలో...
కడప జిల్లాలోని జమ్మలమడుగులో చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. మండుతున్న ఎండలతో చికెన్ ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారిపోయింది. వారం రోజుల క్రితం కిలో 150 నుంచి 170 రూపాయలు ఉన్న చికెన్ రేట్ ఇప్పుడు కిలో 220 రూపాయలకు చేరుకుంది. చికెన్ ధరలు ఇలా ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా కొనగలరని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: మిషన్‌ అరుస్తోంది.. నిజం చెప్పు!

Last Updated : Apr 5, 2021, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.