రోజుకు 500 రూపాయల కూలి... ఓ భార్య, నలుగురు పిల్లలు, తల్లి... ఏ చింతా లేకుండా సంతోషంగా ముందుకు సాగుతున్న కుటుంబాన్ని... ఒక ప్రమాదం, డాక్టర్ల నిర్లక్ష్యం చిన్నాభిన్నం చేశాయి. కడప జిల్లా బద్వేలు రామాంజనేయ నగర్లో ఉన్న చంద్రశేఖర్ పెయింటర్‌గా పని చేసే వాడు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ప్రైవేటు వైద్యులు నిర్లక్ష్యంతో కాలంతా ఇన్ఫెక్షన్ సోకి మంచానికి పరిమితమయ్యాడు.
కష్టపడి సంపాదించుకున్న స్థలం, ఇళ్లు వైద్యం కోసం అమ్ముకున్నారు. ఆర్టీసీలో స్వీపర్‌గా పని చేస్తున్న తల్లే ఇంటికి ఆధారమైంది... దేవుడు కన్నెరజేసినట్లు... గోడకు సున్నం వేస్తూ కింద పడి గాయపడింది. దీనితో వైద్య ఖర్చులకు డబ్బులు లేక సాయం చేసే ఉదారమైన దాతల కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది.
ఇదీ చదవండి