ETV Bharat / state

chandra babu: పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరు?: చంద్రబాబు

అక్బర్ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మైదుకూరులో జగన్ రెడ్డి బంధువు తిరుపాల్ రెడ్డి.. అక్బర్ భాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందన్న చంద్రబాబు.. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandra babu
chandra babu
author img

By

Published : Sep 11, 2021, 12:45 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని చంద్రబాబు ఆరోపించారు. మైదుకూరులో జగన్‌ బంధువు తిరుపాల్‌రెడ్డి అక్బర్‌ బాషా భూమి కబ్జా చేసినట్టు తెలిసిందన్నారు. కొంతమంది పోలీసులు విధులు పక్కనపెడుతున్నారని.. సివిల్‌ పంచాయతీల్లో పోలీసులు తలదూర్చడం మామూలైందని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌ చేస్తానని బాధితుడిని బెదిరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరని ప్రశ్నించారు.

'గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అక్బర్ కుటుంబం కూడా తమకు అదే మార్గం దిక్కంటోంది. తెదేపా అండగా ఉంటుంది.. అక్బర్ బాషా ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం వెంటనే అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలి. బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి' - చంద్రబాబు

ఇదీ చదవండి:

వీడియో వైరల్: సీఐ వేధిస్తున్నాడని ఆ కుటుంబం ఏం చేసిందంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.