YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. పులివెందుల అర్ అండ్ బీ అతిథి గృహంలో.. ముగ్గురు అనుమానితులు విచారణకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా సాక్షి విలేకరి బాలకృష్ణారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో.. బాలకృష్ణారెడ్డి కడప సాక్షి విలేకరిగా పని చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ.. శివశంకర్‌రెడ్డి బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు బాలకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. రెండ్రోజుల క్రితం.. జమ్మలమడుగుకు చెందిన సాక్షి పత్రిక, టీవీ విలేకరుల నుంచి సమాచారం రాబట్టారు.
సీబీఐ విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి
పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. యురేనియం కర్మాగారంలో పని చేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి గురించి.. రెండ్రోజుల క్రితమే కర్మాగారం వెళ్లిన సీబీఐ అధికారులు.. ఉదయ్ గురించి ఆరా తీశారు. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి ప్రకాశ్‌రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించింది. మరోవైపు ఇదే కేసులో డా. మధుసూదన్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈయన పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేస్తున్నారు.
ఇదీ చదవండి
Special Status: ప్రత్యేక హోదా లేదు.. నిధుల సమీకరణకు కృషి చేయండి: భాజపా ఎంపీ జీవీఎల్