ETV Bharat / state

కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు.. ఐదు రోజుల తరువాత వస్తానన్న ఎంపీ - CBI notices to Kadapa MP Avinash Reddy

కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు

author img

By

Published : Jan 23, 2023, 10:21 PM IST

Updated : Jan 24, 2023, 7:16 AM IST

21:55 January 23

రేపు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశం

కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు..

CBI Officials Notices to Kadapa MP Avinash Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో.. సీబీఐ ఎట్టకేలకు సంచలన అడుగులు వేసింది. విచారణకు రావాలంటూ.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి కబురుపెట్టింది. ఇవాళ హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించగా.. అవినాష్​రెడ్డి ఐదురోజులు గడవు కోరారు. తదుపరి ఏం జరగబోతుందనేది.. ఉత్కంఠగా మారింది.

సంచలనం రేపిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు మారిన నేపథ్యంలో,.. సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్​రెడ్డికి నోటీసులివ్వడం సంచలనంగా మారింది. ఇప్పటిదాకా.. ఈ కేసులో ఒక్కసారి కూడా అవినాష్‌ను ప్రశ్నించని సీబీఐ అధికారులు.. సోమవారం పులివెందుల వెళ్లారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన కోసం ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి అక్కడ లేకపోవడంతో.. స్థానిక వైసీపీ కార్యాలయానికి వెళ్లి అడిగారు. భాస్కర్‌రెడ్డి.. అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. కానీ అక్కడికి రాలేదంటూ పార్టీ కార్యకర్తలు చెప్పడంతో.. దాదాపు అరగంటపాటు సీబీఐ అధికారులు అక్కడే వేచి చూశారు. కాసేపటికి.. అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి వచ్చి సీబీఐ అధికారులతో.. మాట్లాడారు. తన సెల్‌ఫోన్‌ నుంచి ఎవరికో కాల్‌ చేసి వారికి ఇచ్చారు. ఆ కాల్‌లో.. మాట్లాడిన అధికారులు కొన్ని వివరాలు సేకరించారు. అనంతరం అవినాష్‌రెడ్డికి.. జారీ చేసిన నోటీసులను రాఘవరెడ్డికి అందజేసి వెళ్లిపోయారు. ఈ ఉదయం 11 గంటలకు హైద్రాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని.. అవినాష్‌రెడ్డిని అందులో కోరారు.

సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన సమయంలో.. విజయవాడలో ఉన్న అవినాష్​రెడ్డి సోమవారం రాత్రి పులివెందుల చేరుకున్నారు. మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనని.. సీబీఐకి లేఖ రాశారు. ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ అధికారి ఫోన్‌ నంబరుకు కాల్‌ చేసి.. సమాచారం ఇచ్చారు. ‘చక్రాయపేటలో మంగళవారం ప్రభుత్వాసుపత్రి ప్రారంభం,.. గండి పుణ్య క్షేత్రంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాలున్నాయని,.. మరో 4 రోజులపాటు ముందుగా నిర్ణయించుకున్న.. ఇతర కార్యక్రమాలున్నాయని వివరించారు. 5 రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని లేఖలో తెలిపారు.

వివేకా హత్య కేసు విచారణ... పులివెందుల పరిధిలో జరిగినన్నాళ్లూ బెదిరింపులు, రివర్స్ కేసులతో ముందడుగు వేయలేకపోయిన,.. సీబీఐ అధికారులు ఈ కేసులో.. ఇంటిగుట్టు రట్టు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లలో.. అవినాష్‌పై పలు అనుమానాలు లేవనెత్తింది. అవినాష్‌రెడ్డి,.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా వివేకాను చంపారనే అనుమానాలున్నాయని.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కడప లోక్‌సభ టికెట్‌ అవినాష్‌రెడ్డికి కాకుండా,.. తనకుగానీ, షర్మిలకుగానీ, విజయమ్మకుగానీ రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని.. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి ఆయనను హత్య చేయించి ఉంటారని.. సందేహించింది. వివేకా హత్యకు సుపారీ ఇచ్చారని,.. ఇందులో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లున్నారని... వివేకా సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారంటూ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్నీ సీబీఐ అధికారులు అభియోగపత్రానికి జత చేశారు. వివేకా హత్యను.. గుండెపోటుగా చిత్రీకరించటంలో,.. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయడంలోనూ అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలది ప్రధాన పాత్రని.. సీబీఐ తేల్చింది.

ఐతే.. అవినాష్‌ ఏ మేరకు విచారణకు సహకరిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. గతంలో.. తన అనుచరుడు శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేస్తేనే.. సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై.. అవినాష్‌రెడ్డి కన్నెర్ర చేశారు. ‘ఎందుకు అరెస్టు చేశావ్‌ అంటూ.. కోర్టు హాలులోనే అడ్డుకున్నారు. గతంలో సీబీఐ అధికారుల బృందం.. పులివెందుల కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలోనూ.. అవినాష్‌రెడ్డి అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు.

ఇలా పులివెందుల పరిధిలో.. కేసు దర్యాప్తును ముందుకు సాగనీయకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా అడుగడుగునా ఆటంకం కల్పించిన అవినాష్‌రెడ్డి.. సీబీఐ ప్రశ్నలకు ఎలాంటి సమాధానమిస్తారనేది.. ఆసక్తికరంగా మారింది. మరోవైపు వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి గురించి సీబీఐ అధికారులు ఆరా తీయడంతో.. తదుపరి ఆయన్నూ విచారణకు పిలవాలనే ప్రయత్నంలో.. ఉందనే మాట వినిపిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 24, 2023, 7:16 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.