ETV Bharat / state

వివేకా హత్య కేసు: 3వ రోజు సీబీఐ సుదీర్ఘ విచారణ.. తర్వాత ఎవరు?

author img

By

Published : Jul 20, 2020, 5:54 PM IST

Updated : Jul 20, 2020, 9:07 PM IST

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఆయన ఇంటినుంచే మొదలు పెట్టింది. దాదాపు 3 గంటల పాటు ఆయన నివాసంలో విచారణ చేసిన అధికారులు... హత్య జరిగిన ప్రదేశాన్ని అణువణువు పరిశీలించారు. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో సీబీఐ అధికారులు 3 గంటల పాటు వివరాలు సేకరించారు.

cbi investigation on ex minister viveka death case

కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన సీబీఐ మూడోరోజు విచారణ చేపట్టింది. రెండురోజుల పాటు పోలీసులతో సమావేశమై హత్య కేసు పూర్వపరాలను తెలుసుకున్న సీబీఐ అధికారులు... ఇవాళ వివేకా కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించారు. ఏడుగురు సీబీఐ అధికారులు ఇవాళ పులివెందులకు వెళ్లి... డీఎస్పీ కార్యాలయంలో వివేకా హత్య కేసు వివరాలను ఆరా తీశారు. ఇదే సమయంలో ఏడుగురిలోని ముగ్గురు సభ్యుల బృందం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి దాదాపు 6.30 గంటల వరకు వివేకా నివాసంలో విచారణ చేపట్టింది. వివేకా ఇంటికి తొలిసారిగా వెళ్లిన సీబీఐ అధికారులు... హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

గత ఏడాది మార్చి 15న వివేకానందరెడ్డి... తన ఇంట్లో దారుణహత్యకు గురయ్యారు. హత్యా స్థలమైన బెడ్ రూం, బాత్ రూంను సీబీఐ పరిశీలించింది. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకా ఇంటిని పరిశీలించే సమయంలో ఇంట్లో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ఉన్నారు. వీరిద్దరితో మాట్లాడిన సీబీఐ అధికారులు హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది... హత్యకు ఏమైనా కారణాలు ఉన్నాయా... ఎవరిపైన అనుమానాలు ఉన్నాయనే కోణంలో సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కాగా హత్య కేసును గతంలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులపై నమ్మకం లేదని.. సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. 15 మంది అనుమానితుల పేర్లు ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు.

మూడు గంటల పాటు వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో మాట్లాడిన సీబీఐ అధికారులు... కేసు పురోగతికి సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిటిషన్ లో పేర్కొన్న విధంగా 15 మంది అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హత్య జరిగిన రోజు మీకు ఎవరు సమాచారం అందించారు... ఎన్ని గంటలకు తెలిసిందనే వివరాలను అడిగినట్లు తెలిసింది. వివేకా హత్యకు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలు, రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారించినట్లు సమాచారం. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సునీత, సౌభాగ్యమ్మ సమాధానం చెప్పారు. వారికున్న అదనపు సమాచారాన్ని కూడా సీబీఐకి ఇచ్చినట్లు తెలుస్తోంది. వివేకా కారు డ్రైవర్ గా ఉన్న ప్రసాద్, ఇంటి వాచ్ మెన్ రంగన్నను విచారించే అవకాశం ఉందని సమాచారం. వివేకా ఇంట్లో లభ్యమైన లేఖలో కారు డ్రైవర్ ప్రసాద్ ఇబ్బంది పెడుతున్నట్లు రాసి ఉంది. దీనిపై ప్రసాద్ ను సీబీఐ అధికారులు లోతుగా విచారణ చేసే అవకాశం ఉంది. అనంతరం ఇంట్లో దారుణ హత్య జరుగుతుంటే.. ఇంటిబయట ఉన్న వాచ్ మెన్ రంగన్నకు తెలియలేదా అనే కోణంలో అతన్ని విచారించే వీలుంది.

సిట్ అధికారులు పలువురు రాజకీయ ప్రముఖులు, అనుమానితులను విచారించినప్పటికీ.. సీబీఐ మొదట్నుంచి విచారణ ప్రారంభించే వీలుంది. ముందుగా వివేకా కుటుంబ సభ్యులను విచారించిన సీబీఐ... తదుపరి ఎవరిని విచారిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్

Last Updated : Jul 20, 2020, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.