ETV Bharat / state

వివేకా హత్య కేసు: ఆర్థిక లావాదేవీల కోణంలో విచారణ - వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడపకు చెందిన ఇద్దరు మహిళలు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. పులివెందులలోని చెప్పుల దుకాణంలో పని చేసే వ్యక్తిని అధికారులు విచారిస్తున్నారు.

cbi investigation in viveka murder case
వివేకా హత్య కేసు
author img

By

Published : Sep 26, 2020, 1:42 PM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 14వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ ఎస్పీ స్థాయి మహిళా అధికారిణి సమక్షంలో అనుమానితుల విచారణ సాగుతోంది. కడప, పులివెందులకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఐదు రోజుల కిందట వీరిద్దరూ సీబీఐ విచారణకు హాజరైన వారే. మరోసారి వీరిని సీబీఐ ప్రశ్నిస్తోంది. వివేకాతో వీరికున్న ఆర్థిక సంబంధాలు, ఇతర వ్యవహారాలపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

పులివెందుల చెప్పుల దుకాణం యజమాని మున్నాను ఐదురోజుల పాటు విచారించిన సీబీఐ అధికారులు... ఇవాళ ఆ దుకాణంలో పనిచేసే బాబు అనే యువకున్ని ప్రశ్నిస్తున్నారు. కడపలో ముగ్గురు అనుమానితుల విచారణ కొనసాగుతోంది. వివేకా హత్యకు ఆర్థిక లావాదేవీల అంశమే ప్రధాన కారణంగా దృష్టి సారించిన సీబీఐ అధికారులు... ఆ కోణంలోనే పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: వివేకా హత్య కేసు: ఆ ముగ్గురిని విచారిస్తున్న సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.