తెలంగాణలో సంచలనం సృష్టించిన పశువైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దారుణానికి పాల్పడిన కిరాతకులను కఠినంగా శిక్షించాలంటూ ఊరూవాడా గళమెత్తింది. నిందితులను ఉరితీయాలని విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఎక్కడికక్కడ మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. కొవ్వొత్తులు ర్యాలీలు నిర్వహించి బాధిత యువతికి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు.
కొవ్వొత్తుల ర్యాలీలు
కడప, పులివెందుల, కమలాపురం, గుంతకల్లు, పాణ్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తుళ్లూరులో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. విశాఖ, రాజమహేంద్రవరం, నరసాపురంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పాడేరులో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మానవహారంలో ఎమ్మెల్యే రజనీ పాల్గొన్నారు. పశువైద్యురాలి హత్యోదంతం ఘటనను తెదేపా తీవ్రంగా ఖండించింది.
ఇదీ చదవండి :