కడప జిల్లా మైదుకూరు పురపాలిక ధరణి తిమ్మాయపల్లెలో ఎడ్ల బండలాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. అవధూత కొండయ్యస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులతో పాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎడ్లు బండను లాగుతున్న కొద్దీ రైతులు ఉత్సాహంతో కేరింతలు వేశారు. ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజు గ్రామానికి చెందిన సోహిత్‌రెడ్డి ఎడ్లకు రూ.3 లక్షలు,.. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన గగనాచౌదరి ఎడ్లు ద్వితీయ స్థానంలో నిలిచి.. రూ.2 లక్షలు గెలుచుకున్నాయి.
ఇదీ చూడండి: