ETV Bharat / state

ప్రమాదకరంగా వంతెన.. ఆందోళనలో ప్రయాణికులు - bridge on penna canal at jammalamadugu kadapa district

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నది వంతెనపై ప్రయాణం చేయాలంటే జనాలు భయపడుతున్నారు. రోడ్డుపై జాయింట్ల వద్ద రబ్బరు పోవడం వల్ల ప్రమాదకరంగా మారింది. అడుగుకో గుంత పలుచోట్ల కడ్డీలు తేలడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. లైటింగ్ వ్యవస్థ లేనందున రాత్రివేళల్లో తరచూ.. ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

bridge on penna canal was damaged at jammalamadugu kadapa district
ప్రమాదకరంగా వంతెన.. ఆందోళనలో ప్రయాణికులు
author img

By

Published : Oct 18, 2020, 11:18 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకి వెళ్లే దారిలో పెన్నా నదిపై వంతెన ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు శివారులో 67వ జాతీయ రహదారిపై ఈ వంతెన ప్రారంభించిన 12 ఏళ్లకే పలుచోట్ల కడ్డీలు తేలాయి. రక్షణ గోడ రెండుచోట్ల ధ్వంసమైంది. వంతెనపై 13 స్తంభాలు ఉండగా 31 జాయింట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటి మధ్యం రబ్బరు ధ్వంసం కావడం వల్ల ప్రమాదకరంగా మారిందని... ప్రయాణం కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.

పలుచోట్ల గుంతలు పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాయాణికులు పేర్కొన్నారు. లైటింగ్ వ్యవస్థ లేనందున రాత్రివేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందారు. లైటింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

నెల్లూరు జిల్లాలో విషాదం..విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.