కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏటా మే నెలలో జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యేవారు. సుమారు పదకొండు రోజులపాటు పట్టణంలో పండగ వాతావరణం ఉండేది.
కరోనా వైరస్ కారణంగా బ్రహ్మోత్సవాలు కొంతమందికే పరిమితమయ్యాయి. సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. తితిదే ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసినట్లు ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. ఈ నెల 16 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 12వ తేదీన రథోత్సవము ఉండగా... దాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు.
ఇదీ చూడండి కరోనాపై ప్రచారానికి.. యముడు, చిత్రగుప్తుడు వచ్చారు!