కరోనా వల్ల పద్నాలుగు నెలలుగా బ్రాహ్మణులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరస్ వ్యాప్తి కారణంగా ముహూర్తాలు లేక, సరైన ఆదాయం రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయన అన్నారు. కొవిడ్ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 180 మందికి పైగా బ్రహ్మణులు చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్… బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని ప్రసాద్ శర్మ కోరారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ పరిస్థితులను రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోద దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: కన్నవారు దూరమైనా.. నిస్సహాయ స్థితిలో ప్రవాసాంధ్రులు!